calender_icon.png 16 March, 2025 | 8:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ అలసత్వంతోనే కృష్ణా జలాల మళ్లింపు

16-03-2025 01:58:43 AM

ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 

హైదరాబాద్, మార్చి 15 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ అలసత్వ వైఖరితోనే కృష్ణా జలాలు ఏపీకి తరలిపోతున్నాయని ఇరిగేషన్‌శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు, కులగణనపై బీఆర్‌ఎస్ సభ్యుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రభుత్వంపై చేసిన విమర్శలపై మంత్రి స్పందించారు.

పులిచింతల ప్రాజెక్టుతో తెలంగాణకు వచ్చిన నష్టమేమీ లేదని, ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల కృష్ణ జలాలు వస్తే.. ఏపీకి 512 టీఎం సీలను ఇస్తూ నాటి సీఎం కేసీఆర్ సంతకాలు చేశారని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యంతోనే పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెరిగిందని ఆరోపించారు.

నాటి ఏపీ సీఎం జగన్, కేసీఆర్ విందు వినోదాలు చేసిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఆ తర్వాతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మొదలైందని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్ సర్కారు చేసిన తప్పిదాలతోనే శ్రీశైలం బ్యాంక్  వాటర్‌ను ఏపీ అక్రమంగా తరలించుకుపోతోందని దుయ్యబట్టారు. కులగణన ప్రక్రియను ఎంతో పారదర్శకంగా జరిగిందన్నారు.