calender_icon.png 19 April, 2025 | 7:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కృష్ణానది యాజమాన్య కేంద్రం జేబులో ఉంది

12-04-2025 12:46:59 AM

  1. వట్టెం నుంచి సిరసవాడ కాలువ ద్వారా నల్లగొండకు నీళ్లు అందించవచ్చు

ఎక్కువ ఖర్చు పెట్టి నల్లగొండకు నీళ్లు అందించెందుకు ప్రభుత్వం టెండర్లకు పిలుపు

శ్రీశైలం కుడి మెయిన్ కాలువ లైనింగ్ పనులు ఆపాలి

కాంగ్రెస్ ప్రభుత్వం  మొద్దు నిద్ర వీడాలి

పాలమూరు మిగిలిన పనులు పూర్తి చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం 

మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి   

వనపర్తి,  ఏప్రిల్ 11 ( విజయక్రాంతి ) : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్టాలకు సంబందించి కృష్ణా నది లోని నీటి వాటా తేల్చ కుండా గడిచిన 10 సంవత్సరాలనుండి కేంద్రం ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహారిస్తూ వస్తుందని నీటి వాటా తేల్చకుండా కృష్ణా నది యాజమాన్యం బోర్డు కేంద్ర ప్రభుత్వం జేబులో ఉందని మాజీ  మంత్రి  సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.

శుక్రవారం జిల్లా కేంద్రంలోని తన నివాస గృహంలో ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీశైలం కుడి మెయిన్ కెనాల్ (SRMC) లైనింగ్ పనుల వల్ల, కృష్ణా నదిపై ఏపీ చేపట్టిన ప్రాజెక్టుల మూలంగా తెలంగాణకు అనేక నష్టాలు కలుగుతాయన్నారు.

శ్రీశైలం కుడి మెయిన్ కెనాల్ లైనింగ్ పను లు ఏపీ ప్రభుత్వం చేపట్టడం వల్ల కెనాల్ సామర్థ్యం గణనీయంగా 44,000 క్యూసెక్కుల నుండి 89,762 క్యూసెక్కులకు పెరుగుతుందని, కెనాల్ సామర్థ్యం పెరగడం వల్ల ఏపీ ప్రభుత్వం శ్రీశైలం జలాశయం నుండి ఎక్కువ నీటిని రాయలసీమ ఎత్తిపోతల పథకం మరియు ఇతర ప్రాజెక్టులకు తరలించే అవకాశం ఉందన్నారు.

ఇది కృష్ణా బేసిన్లోని తెలంగాణ ప్రాజెక్టులకు నాగార్జునసాగర్, కల్వకుర్తి ఎత్తిపోతల, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు నీటి లభ్యతను తగ్గిస్తుందని  దీనివల్ల  వర్షాభావ సమయాల్లో తెలంగాణలోని రైతులు సాగునీటి కొరతతో పాటు వ్యవసాయ ఉత్పాదక తను దెబ్బతీస్తుందన్నారు. శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ తగ్గడం వల్ల తెలంగా ణలోని విద్యుత్ ఉత్పాదన మరియు ఇతర నీటి ఆధారిత కార్యకలాపాలు పూర్తిగా దెబ్బతినవచ్చన్నారు. 

బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు కృష్ణా నది జలాల పంపిణీపై కీలకమైనది. ఏపీ ప్రభుత్వం ఈ తీర్పు తెలంగాణకు అనుకూలంగా వస్తుందని భావిస్తూ, కెనాల్ లైనింగ్ పనులను నిబంధనలకు విరుద్ధంగా చేపడుతుందని ఆయన వివరించారు. 

ట్రిబ్యునల్ తీర్పు ఏపీ మరియు తెలంగాణ మధ్య నీటి కేటాయింపును సమీక్షి స్తుందని . బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు తెలంగాణకు ఎక్కువ నీటిని కేటాయిస్తే, రాయలసీమ మరియు ఇతర ప్రాంతాలకు నీటి లభ్యత తగ్గుతుందని. అందుకే, తీర్పు అమలు కాకముందే ఎస్ ఆర్ ఎం సి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా ఎక్కువ నీటిని స్వాధీనం చేసుకోవాలని ఏపీ భావిస్తున్నదని ఆయన వివరించారు.

ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్, 2014 ప్రకారం, కృష్ణా బేసిన్లో కొత్త ప్రాజెక్టులు లేదా సామర్థ్య విస్తరణలు కే ఆర్ ఎం బి  మరియు అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా చేపట్టకూడదుని అయినప్పటికీ, ఏపీ ఎస్ ఆర్ ఎం సి  లైనింగ్ పనులను గుట్టుగా చేపట్టడం ఈ నిబంధనలను ఉల్లంఘించడమేనన్నారు.

ఏపీలోని టీడీపీ ప్రభుత్వం రాయలసీమ ప్రాంతంలో రాజకీయంగా బలపడడం కోసం, నీటి లభ్యతను పెంచే ప్రాజెక్టులను వేగవంతం చేయా లని భావిస్తున్నదని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ మనుగడ ఏపీలోని టీడీపీ మద్దతు మీద ఆధారపడిన నేపథ్యంలో దానిని అవకాశంగా తీసుకుని ఏపీలోని చంద్రబాబు ప్ర భుత్వం జలదోపిడీకి పాల్పడుతున్నదన్నారు.

కేంద్రం చేతిలో కీలుబొమ్మగా ఉన్న కేఆర్‌ఎంబీ ఏపీ ప్రయత్నాలను నిలువరించడం లేదని, మరోవైపు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదన్నారు. ఇప్పటికే నా గార్జున సాగర్ కేంద్ర బలగాల ఆధీనంలోకి వెళ్లినా, శ్రీశైలం నుండి, నాగార్జున సాగర్ నుండి కేటాయింపులకు అదనంగా నీటిని కొల్లగొడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం లేదన్నారు.

కృష్ణా నదిపై ఆంధ్రప్రదేశ్ (ఏపీ) ప్రభుత్వం 2014 తర్వాత చేపట్టిన ప్రాజెక్టులు,ఎత్తిపోతల పథకాలతో పాలమూరు జిల్లాకు నష్టాలు కలిగి ఉందన్నారు. ఏపీ చేపట్టిన ఎత్తిపోతల పథకాలతో ముఖ్యంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం, శ్రీశైలం జలాశయం నుండి గణనీయమైన నీటిని తరలిస్తాయి. దీంతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వంటి తెలంగాణ ప్రాజెక్టులకు నీటి నీటికొరత ఏర్పడుతుందన్నారు. 

రూ 100 కోట్ల తో వట్టెం రిజర్వాయర్ నుండి  సిరస వాడ కాలువ  ద్వారా నలగొం డ ప్రాంతానికి నీటిని అందించవచ్చని అలా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వాయర్ నుండి టన్నెల ద్వారా  నీరునందించే ప్రయ త్నం చేస్తున్నారని ఇందుకు గాను మొదటి విడతగా రూ 1300 కోట్ల కు టెండర్ సైతం చేయడం జరిగిందని తక్కువ ఖర్చుతో అయ్యే పనికి వందల కోట్లు  ఖర్చు పెట్టడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. 

వట్టెం రిజర్వాయర్ నుండి నల్గొండ కు నీళ్లు అందించేందుకు గాను అప్పటి, ప్రస్తుత మంత్రి జూపల్లి కృష్ణారావు, తనతో పాటు ఎంపీ సైతం సంతకం పెట్టి అప్పటి ముఖ్యమంత్రి కి లెటర్ సైతం ఇవ్వడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. 

2014 తర్వాత ఏపీ ప్రభుత్వం కృష్ణా నదిపై చేపట్టిన పథకాలు....

రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా  శ్రీశైలం జలాశయం నుండి కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు నీటిని ఎత్తిపోసే పథకం. ఈ పథకం కింద శ్రీశైలం కుడి మెయిన్ కెనాల్ (SRMC) సామర్థ్యాన్ని 44,000 క్యూసెక్కుల నుండి 89,762 క్యూసెక్కులకు పెంచే లైనింగ్ పనులు చేపట్టారన్నారు. 

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ ద్వారా శ్రీశైలం జలాశయం నుండి బనకచెర్ల రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకు నీటిని సరఫరా చేసే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44,000 క్యూసెక్కుల నుండి 80,000 క్యూసెక్కులకు పెంచే పను లు చేపట్టారన్నారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వా రా కృష్ణా నదిపై శ్రీశైలం జలాశయం నుండి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు నీటిని సరఫరా చేసే బహుళార్థసాధక ప్రాజెక్టు.

ఈ ప్రాజెక్టు కింద 43.5 టీఎంసీ నీటిని ఎత్తిపోస్తారన్నారు .చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా నది నుండి పశ్చిమ గోదావరి మరియు కృష్ణా జిల్లాలకు నీటిని ఎత్తిపోసే పథకం. ఈ పథకం కొత్త ఆయకట్టును సృష్టించడంతో పాటు ఇప్పటికే ఉన్న ఆయకట్టును స్థిరీకరిస్తుందన్నారు.

శ్రీశైలం కుడి మెయిన్ కెనాల్ లైనింగ్ పనుల ద్వారా శ్రీశైలం కుడి మెయిన్ కెనాల్ సామర్థ్యాన్ని రెట్టింపు చేసేందుకు లైనింగ్ పనులు చేపట్టారు, దీని ద్వారా రాయలసీమకు ఎక్కువ నీటిని తరలించవచ్చన్నారు.  ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, నాయకులు తిరుమల్, రహీం, గులాం ఖాదర్, కురుమూర్తి యాదవ్, నందిమల్ల అశోక్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.