హైదరాబాద్,(విజయక్రాంతి): జలసౌధలో కృష్ణా నది యాజమాన్య బోర్డ్(Krishna River Management Board) మంగళవారం సమావేశం నిర్వహించింది. ఛైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన నిర్వహించి కేఆర్ఎంబీ సమావేశానికి ఏపీ, తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీలు, తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్, ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరరావు, ఇంజనీర్లు హజరయ్యారు. ఉమ్మడి ప్రాజెక్టులు రెండు రాష్ట్రాల్లో నిర్మిస్తున్న ప్రాజెక్టులు, తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి వాటా, బోర్డు నిర్వహణ, టెలిమెట్రి స్టేషన్ల ఏర్పాటు, ఇరు రాష్ట్రాల అభ్యంతరాలపై చర్చించారు. ఈ సమావేశంలో నారాయణపేట కొడంగల్ ప్రాజెక్ట్, అచ్చంపేట సుంకిశాల, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులపై అభ్యంతరాలను ఏపీ తెలిపింది. రాయలసీమ పోతిరెడ్డిపాడు విస్తరణ, ఆర్డీఎస్ కుడికాలువ పనులపై అభ్యంతరాలను తెలంగాణ వెల్లడించింది.