calender_icon.png 19 March, 2025 | 8:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేఆర్‌ఎంబీకి కృష్ణా ప్రాజెక్టులు!

19-03-2025 02:00:48 AM

పిటిషన్‌పై సుప్రీంలో విచారణ

న్యూఢిల్లీ, మార్చి 18: కృష్ణానది ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించాలని కేంద్రప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 2021లో కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ తెలంగాణ నీటిని వాడుకుంటోందని ఏపీ ప్రభు త్వం సైతం అత్యున్నత న్యాయస్థానం లో పిటిషన్ దాఖలు చేసింది.

తెలంగాణ జారీ చేసిన జీవోను రద్దు చేయా లని ఆ పిటిషన్‌లో ఏపీ కోరింది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీం విచారణ చేపట్టింది. కాగా, కేంద్రం ఇచ్చిన పిటిషన్‌పై స్టే ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం మరో పిటిషన్ వేసింది.

తెలంగాణ వేసిన రిట్ పిటిషన్లపై రెండు వారాల్లో కౌంట ర్ దాఖలు చేయాలని కేంద్రం, ఏపీ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది. రెండు ప్రభుత్వాలు కౌంటర్ దాఖలు చేసిన వారం రోజుల్లో రిజాయిండర్ ఫైల్ చేయాలని జస్టిస్ అభయ్ ఒకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.