హైదరాబాద్/ నల్లగొండ, ఆగస్టు 28 (విజయక్రాంతి): ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణాలోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఫలితంగా నది బేసిన్‌లోని అన్ని ప్రాజెక్టు ల గేట్లు తెరుచుకున్నాయి. బుధవారం సా యంత్రం ఆల్మట్టి ప్రాజెక్టు నుంచి నారాయ ణపూర్ ప్రాజెక్టుకు 1.75 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. అక్కడి నుంచి జూరాలకు 1.79 లక్షల క్యూసెక్కుల జలాలు చేరుతున్నాయి. కర్ణాటకలో భీమా నదిపై చిత్తాపూర్ తాలుకాలో ఉన్న సన్నిధి డ్యాం నుంచి 1.75 లక్షల క్యూసెక్కుల జలాలు జూరాలకు వెళ్తున్నాయి. ఫలితంగా జూరాలలో 2.44 క్యూసె క్కుల ఇన్‌ఫ్లో ఉంది.
3 లక్షల క్యూసెక్కులకు పైగా జలాలు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతున్నా యి. ప్రాజెక్ట్ అధికారులు ప్రాజెక్టు పరిధిలో 45 గేట్లు ఎత్తి దిగువకు జలాలు విడుదల చేశారు. శ్రీశైలం నుంచి ఆరు గేట్లను 10 అ డుగల మేర ఎత్తి 1.69 లక్షల క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 69 వేల క్యూసెక్కుల ను సాగర్‌కు వదిలారు. నాగార్జున సాగర్‌కు ఎగువ నుంచి 1.95 లక్షల క్యూసెక్కుల వర ద వచ్చి చేరుతోంది. దీం తో ప్రాజెక్టు అధికారులు బుధవారం 18 క్రస్టు గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి స్పిల్ వే ద్వారా లక్షన్నర క్యూసెక్కుల జలాలను ది గువకు వదిలారు.