06-02-2025 08:17:04 PM
మందమర్రి (విజయక్రాంతి): జిల్లా చెస్ అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా పట్టణంలోని పంచముఖి వెల్ఫేర్ సొసైటీ సభ్యులు, శ్రీ పంచముఖి ఆంజనేయస్వామి ఆలయ అర్చకులు, డింగిరి కృష్ణకాంత్ ఆచార్యని నియమించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర చదరంగం అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఎండీ సిరాజ్ ఉర్ రహమాన్ గురువారం నియామక పత్రం అందచేశారు. ఆలయ అర్చకులుగా పేద వారికీ చేసిన సేవలు ఎన్నో ఉన్నాయని కొనియాడుతు, వారి సేవలను జిల్లాలోని చదరంగం క్రీడాకారులకు అందించి వారిని ప్రోత్సహించాలని కోరారు. ఇదిలా ఉండగా జిల్లా చెస్ అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా నియమితులైన కృష్ణ కాంతాచార్యులును పలువురు అభినందించారు.