calender_icon.png 17 April, 2025 | 4:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రిశాంక్ విచారణకు సహకరించాలి

09-04-2025 01:21:07 AM

హైకోర్టు ఆదేశాలు

విచారణ నాలుగు వారాల పాటు వాయిదా

హైదరాబాద్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ నేత క్రిశాంక్ పోలీసుల విచారణకు సహకరించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై  క్రిశాంక్ కృత్రిమ మే ధను వినియోగించి కొన్ని చిత్రాలు తయారు చేయించాడని, వాటిని సోషల్‌మీడియాలో వైరల్ చేయించాడనే అభియోగంపై గచ్చిబౌలి పోలీసులు ఆయన పలు సెక్షన్ల ప్రకా రం కేసులు నమోదు చేశారు. ఈ కేసులను సవాల్ చేస్తూ తాజాగా హై కోర్టును ఆశ్రయించాడు.

పిటిషన్‌పై మంగళవారం న్యాయస్థానం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపి స్తూ.. పోలీసులు ఒకే ఘటనను ఆ ధారంగా చేసుకుని పిటిషనర్‌పై నాలుగు కేసులు నమోదు చేశారని, రా జకీయ దురుద్దేశంతోనే ఆయనపై కే సులు పెట్టారని కోర్టుకు తెలిపారు.

ప్రభుత్వం తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు రాష్ట్రప్రభుత్వంపై పిటిషనర్ ఉద్దేశపూర్వకంగా అసత్యప్రచారం చేశాడని, ఏఐ చిత్రాలను సోషల్‌మీడియాలో వ్యాప్తి చేశారని కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం స్పందిస్తూ.. పోలీసుల విచారణకు పిటిషర్ క్రిశాంక్ సహకరించాలని, అలాగే ఇదే కేసులో కొణతం దిలీప్‌కు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది.