calender_icon.png 19 November, 2024 | 6:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డాక్టర్‌ను వివాహమాడిన క్రిష్

12-11-2024 12:00:00 AM

దర్శకుడు క్రిష్ వివాహం చేసుకున్నారు. ప్రీతి చల్లా అనే వైద్యురాలిని హైదరాబాద్‌లో సోమవారం ఆయన వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో ఈ వివాహం వైభవంగా జరిగినట్టు తెలుస్తోంది.

వెడ్డింగ్ ఫోటోలను ప్రీతి టీం సోషల్ మీడియాలో షేర్ చేసి శుభాకాంక్షలు తెలిపింది. ప్రీతి హైదరాబాద్‌లో గైనకాలజిస్ట్‌గా పని చేస్తున్నారు. ‘గమ్యం’ చిత్రంతో క్రిష్ దర్శకుడిగా చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ఆ తరువాత వేదం, కంచె వంటి చిత్రాలను రూపొందించారు. ప్రస్తుతం ఆయన అనుష్కతో ‘ఘాటి’ సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా ఇది రూపొందుతోంది.