05-03-2025 05:38:58 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేసి ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రితో వెంటిలేటర్ సహాయంతో చికిత్స పొందుతున్నారు. తన ఆత్మహత్య యత్నంపై వస్తున్న కథనలపై కల్పన స్పందించారు. తన కుమార్తెతో జరిగిన మనస్పర్థాలతో నిద్ర పట్టక అధిక మోతాదులో నిద్రమాత్రాలు వేసుకోవడంతోనే అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు కల్పన వెల్లడించారు. తాను ఆత్మహత్యాయత్నం చేయలేదని, ఈ సంఘటనలో ఎవరి ప్రమేయం లేదన్న కల్పన వాంగ్మూలాన్ని కేపీహెచ్బీ పోలీసులు రికార్డు చేసుకున్నారు. అయితే గత ఐదేళ్లుగా తన భర్త ప్రసాద్ కలిసి నిజాంపేట రోడ్డులోని వర్టెక్స్ ప్రివిలేజ్ విల్లాస్ లో నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు.
కూమరై దయా ప్రసాద్ కు కల్పనకు చదువు విషయంలో మనస్పర్థలు వచ్చాయని, దయాను తనతో పాటు హైదరాబాద్ రమంటే రాకపోవడంతో కల్పన ఒక్కరే నగరానికి వచ్చారన్నారు. కల్పన భర్త ఎన్నిసార్లు ఫోన్ చేసిన తీయకపోవడంతో ఆయన కాలనీ వెల్ఫేర్ సభ్యులకు ఫోన్ చేశారని పోలీసులు వెల్లడించారు. దీంతో వెల్ఫేర్ సభ్యులు కల్పన ఇంటి డోర్ ఎంత తట్టి తీయకపోవడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. విల్లాస్ కు చేరుకున్న పోలీసులు డోర్ తీసుకొని లోనికి వెళ్లగా అప్పటికే కల్పన అపస్మారక స్థితిలో పడిపోయి కనిపించారు. స్థానికుల సహాయంతో హుటాహుటిన చికిత్స నిమిత్తం నిజాంపేట రోడ్డులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.