calender_icon.png 27 December, 2024 | 4:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేపాల్ నూతన ప్రధానిగా కేపీ శర్మ ఓలి

15-07-2024 01:04:42 AM

కాఠ్మండూ, జూలై 14 : నేపాల్ నూతన ప్రధానిగా కేపీ శర్మ ఓలి ఎన్నికయ్యారు. పార్లమెంట్‌లో నిర్వహించిన బల నిరూపణ పరీక్షలో మాజీ ప్రధాని పుష్పకమల్ దహల్ ‘ప్రచండ’ విఫలమవ్వడంతో ఆయన ప్రభుత్వం కుప్పకూలింది. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ (సీపీఎన్ ఛైర్మన్ కేపీ శర్మ ఓలీ  ప్రధానిగా ఎన్నికయ్యారు. రాష్ట్రపతి రామ్ చంద్ర పౌడెల్ సోమవారం ఉదయం ఓలీతో పాటు ఇతర మంత్రివర్గ సభ్యులతో ప్రమాణం చేయించనున్నారు. 275 మంది సభ్యులున్న నేపాల్ పార్లమెంటులో  విశ్వాస పరీక్షలో.. ప్రచండ ప్రభుత్వానికి అనుకూలంగా 63 ఓటు, వ్యతిరేకంగా 194 ఓట్లు పడ్డాయి. ప్రధానిగా ఎన్నికైన కేపీ శర్మ ఓలి మళ్లీ తాను ప్రధాని అయ్యేందుకు సభలో అతిపెద్ద పార్టీగా ఉన్న నేపాలీ కాంగ్రెస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. నేపాలీ కాంగ్రెస్‌కు 89 స్థానాలు, శర్మ నేతృత్వంలోని సీపీఎన్ 78 స్థానాలు ఉన్నాయి.