calender_icon.png 6 March, 2025 | 2:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహనీయుల జీవితాలు మనకు వ్యక్తిత్వ వికాస పాఠాలు

02-03-2025 06:42:59 PM

శ్రీపాద రావు జయంతిలో పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష...

పెద్దపల్లి (విజయక్రాంతి): మహనీయుల జీవితాల నుంచి మనం అనేక వ్యక్తిత్వ వికాస పాఠాలను నేర్చుకోవచ్చని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. ఆదివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన స్వర్గీయ శ్రీపాద రావు జయంతి వేడుకలలో అదనపు కలెక్టర్ డి.వేణుతో కలిసి పాల్గొని, జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... మారుమూల ప్రాంతమైన ధన్వాడలో పుట్టి శాసనసభ స్పీకర్ స్థాయికి ఎదిగిన మహనీయులు శ్రీపాదరావు అని, ప్రతి ఒక్కరితో మంచిగా వ్యవహరిస్తూ తన జీవితం కొనసాగించారని, న్యాయవాదిగా వృత్తి కొనసాగిస్తున్న సమయంలో ప్రజల ఆకాంక్షల మేరకు రాజకీయాల్లోకి వచ్చి సర్పంచ్ స్థాయి నుంచి శాసనసభ స్పీకర్ స్థాయికి ప్రజల ఆశీర్వాదంతో ఎదిగారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక మంది స్థానిక నాయకుల జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నామని, అదే రీతిలో ప్రభుత్వ ఆదేశాల మేరకు శ్రీపాద రావు జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో డివైస్ ఓ సురేష్, డీఈఓ మాధవి, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.