22-02-2025 02:22:19 PM
అధికారిక ఉత్సవాల్లో ప్రోటోకాల్ రగడ
వేడుకల నుండి వెనుదిరిగిన ఎమ్మెల్యే
కుమ్రంభీంఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్ సమీపంలో శనివారం శ్రీ సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించారు. అధికారులు, నిర్వాహకులు ప్రోటోకాల్ పాటించడం లేదని సభలో ఎమ్మెల్యే కోవలక్ష్మి ఫైర్ అయ్యారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న వేడుకల్లో తనకు గుర్తింపు ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. వేడుకల సందర్భంగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో తన ఫోటో లేదని కేవలం కాంగ్రెస్ నాయకుల ఫోటోలను ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.అధికారులు, నిర్వాహకులు ఎమ్మెల్యే ను సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ సభను వాక్ అవుట్ చేసి వెళ్ళిపోయారు.