calender_icon.png 1 November, 2024 | 1:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోవ లక్ష్మి సంస్కార హీనురాలు

03-07-2024 03:57:49 AM

  • డీసీసీ అధ్యక్షుడిపై వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి 
  • కాంగ్రెస్ నేత ఆత్రం సుగుణ

కుమ్రంభీం ఆసిఫాబాద్, జూలై2 (విజయక్రాంతి): ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి సంస్కారహీనురాలుగా మిగిలిపోతుందని కాంగ్రెస్ నేత ఆత్రం సుగుణ ధ్వజమెత్తారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద కోవ లక్ష్మి దిష్టిబొమ్మను దహనం చేశారు. అంతకుముందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధి కోసం పాటుపడు తున్న డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావుపై ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అభివృద్ధిని చూసి ఓర్వలేకనే డీసీసీ అధ్యక్షుడిపై ఆరోపణలు చేస్తున్నదన్నారు. అభివృద్ధిపై కలెక్టరే ట్ ముందుకు చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఎమ్మెల్సీ కవితకు పట్టిన గతే కోవ లక్ష్మికి పడుతుందని హెచ్చరించారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో ఆదివాసి సెల్ జిల్లా అధ్యక్షుడు విశ్వనాథ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు రాజేంద్రకుమారి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు వసంత్‌రావు పాల్గొన్నారు.