calender_icon.png 13 March, 2025 | 10:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోటితో చేసిన కోటి తలంబ్రాలు కాలినడకన రామయ్య చెంతకు

13-03-2025 07:35:30 PM

చర్ల,(విజయక్రాంతి):  భద్రాద్రి సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి(Bhadradri Seetha Ramachandra Swamy Kalyana Mahotsavam) గోటితో కోటి తలంబ్రాలు ఒలిచిన భక్తుల బుధవారం తెల్లవారుజామున  పాత చర్ల శ్రీ సీతారామ లక్ష్మణ భక్తాంజనేయ స్వామి వారి ఆలయం నుంచి రఘు థియేటర్ పెద్ద బావి సెంటర్ శ్రీ ముత్యాలమ్మ తల్లి పోలీస్ స్టేషన్ మీదుగా నగర సంకీర్తనతో భక్తులు భద్రాచలం కాలినడకన  బయలుదేరారు.

ప్రతి ఏటా  రామయ్యకు గోటితో ఒలచిన కోటి తలంబ్రాలు ఆనవాయితీగా చర్ల నుంచి భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి చెంతకు తీసుకెళ్లడం జరుగుతుంది.వీటిని తీసుకెళ్లే భక్తులు భక్తిశ్రద్ధలతో మోస్తూ తీసుకుని వెళ్తారు ఈ కార్యక్రమం లో పాల్గొన్న భక్తులు మచ్చ వీర్రాజు, అయ్యంగిరి నాగేశ్వరావు, మడకం దేవయ్య,దొంతు త్రినాధరావు మన్విత, మచ్చ సత్యవతి,పుప్పాల వరలక్ష్మి,కేతన చక్రపాణి, పొనగంటి సౌజన్య, పుప్పాల లోహిత్, తనుకు తిరుపతమ్మ, తాళ్ళూరి వరలక్ష్మి, జలదని రాజేశ్వరి, మీసాల సరస్వతి, తోట భారతి, బొజ్జా రాధిక, మయూరి, గోరింట్ల వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.