calender_icon.png 19 April, 2025 | 7:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్

17-04-2025 12:00:00 AM

భూసేకరణ పెండింగ్ పరిహారం త్వరగా చెల్లించాలి

క్యాబినెట్ సెక్రటరీ (కోఆర్డినేషన్) సెంట్రల్ సెక్రటేరియట్

 సిరిసిల్ల, ఏప్రిల్ 16: (విజయక్రాంతి):  కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ భూసేకరణ పెండింగ్ పరిహారం త్వరగా చెల్లించాలని క్యాబినెట్ సెక్రటరీ (కోఆర్డినేషన్) సెంట్రల్ సెక్రటేరియట్ అన్నారు. బుధవారం క్యాబినెట్ సెక్రటరీ (కోఆర్డినేషన్) సెంట్రల్ సెక్రటేరియట్ కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ భూ సేకరణ పై  నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ పాల్గోన్నారు. కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ అభివృద్ధి పనులలో పెండింగ్ భూ సేకరణ పరిహారం చెల్లింపుల స్థితి గతుల పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

ఈ సందర్భంగా క్యాబినెట్ సెక్రటరీ (కోఆర్డినేషన్) సెంట్రల్ సెక్రటేరియట్ మాట్లాడుతూ, మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు 151 కిలో మీటర్ల రైల్వే లైన్ అభివృద్ధి పనులు భాగంగా భూ సేకరణ పెండింగ్ పరిహార చెల్లింపు సంబంధిత లబ్ధిదారులకు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్లకు సూచించారు. సిద్దిపేట, మెదక్ ,కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలను సికింద్రాబాద్ రైల్వే లైన్ కలపడం వల్ల పారిశ్రామికంగా ప్రాంతం అభివృద్ధి చెందుతుందని,  మనోహరాబాద్ నుంచి గజ్వేల్ వరకు 32 కిలోమీటర్లు, గజ్వేల్ నుంచి సిద్దిపేట వరకు 40 కిలోమీటర్లు, సిద్దిపేట నుంచి సిరిసిల్ల వరకు 40.80 కిలోమీటర్లు, సిరిసిల్ల నుంచి కొత్తపల్లి వరకు 39 కిలోమీటర్ల  4 దశలలో పనులు చేపట్టడం జరిగిందని అన్నారు.

ప్రస్తుతం రెండవ దశ పనులు జరుగుతున్నాయన్నారు. ఈ పనులు చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం నుంచి భూసేకరణ పూర్తి చేసి రైల్వే కు అప్పగించాలని అన్నారు. పెండింగ్ భూ సేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు.  వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ సిరిసిల్ల జిల్లాలో 40 కిలోమీటర్ల మేర ఉందని, దీనికి సంబంధించి 386.21 హెక్టార్ల భూ సేకరణ చేయాల్సి ఉండగా 342.46 హెక్టర్ల భూమి సేకరించి రైల్వే శాఖకు బదిలీ చేశామని అన్నారు.

పెండింగ్ ఉన్న 43.42 హెక్టార్ల భూ సేకరణలో భాగంగా రిజర్వ్ ఫారెస్ట్  15.21 హెక్టార్లను రైల్వే శాఖకు అప్పగించమని దాని బదులు అటవీ శాఖకు కొనరావుపేట మండలంలోని కొండాపూర్ గ్రామంలో 38 ఎకరాల ఐదు గుంటల  భూమి అందించమన్నారు.  పెండింగ్ భూసేకరణ చేసేందుకు 68 కోట్ల 80 లక్షలు పీడీ అకౌంట్ లో జమ అయ్యాయని, భూ నిర్వాసితులకు పరిహార చెల్లింపు కోసం రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం వేసి చూస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు.  ఈ సమావేశంలో  జిఎం ఇండస్ట్రీస్ హనుమంతు కలెక్టరేట్ సూపర్డెంట్ శ్రీకాంత్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.