భీమదేవరపల్లి, జనవరి 10: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం స్వామివారి కల్యాణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. వీరభద్రుడు, భద్రకాళి మాత ఉత్సవ మూర్తులను మేళతాళల మధ్య ఆలయ కల్యాణ ప్రాంగణానికి అర్చకులు తీసుకువచ్చారు.
అనంతరం స్వామివారి కల్యాణం ఘనంగా జరిపించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సతీమణి మంజుల, ఆలయ ఈవో పీ కిషన్‌రావు, ఆలయ చైర్మన్ కొమురవెళ్లి చంద్రశేఖర్‌గుప్తా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.