calender_icon.png 14 March, 2025 | 12:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్తకొండ వీరభద్రుడి ఉత్సవాలు షురూ

17-12-2024 12:23:56 AM

భీమదేవరపల్లి, డిసెంబరు 16: ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొత్తకొండ వీరభద్రుని ఆలయంలో సంక్రాంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.  హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్త కొండలో ధనుర్మాస ప్రారంభ ఉత్సవాలు సోమవారం అర్చకులు వైభవంగా నిర్వహించారు. సూర్యుడు ధనురాశ్శిలో ప్రవేశించి నపుడు ధను సంక్రమణం అని శాస్త్రాలయం దు చెప్పబడుతున్నది.

సోమవారంతో సరిగ్గా నెల రోజుల తర్వాత సంక్రాంతి జాతర నిర్వహిస్తారు. ధనుర్మాస ఆరంభ ఉత్సవాలను ప్రాంతీయ వాడుక భాషలో సంక్రాంతి పర్వదినం నిలబెట్టడం అని చెప్పబడుచున్నది. సోమవారం ఆలయ అర్చకులు సంక్రాంతి పర్వదినం నిలబెట్టడం ఉత్సవాన్ని నిర్వహించారు. స్వామి వారి కల్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికను ఈవో కిషన్‌రావుకు అందజేశారు. ఆలయంలోని వీరభద్రుడు, భద్రకాళీ అమ్మవార్లకు పూజలు చేశారు.