calender_icon.png 5 April, 2025 | 11:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్తగూడెం వీకేఓసీని పూర్తిగా సింగరేణి కార్మికులతోనే నడపాలి

29-03-2025 12:00:00 AM

కాపుకృష్ణ 

కొత్తగూడెం, మార్చి 28 (విజయక్రాంతి ) కొత్తగూడెం ఏరియాలో నూతనంగా ప్రారంభం కానున్న వి.కే.ఓ.సీ ని ప్రైవేటు వ్యక్తులకు కాకుండా, గతంలో జికేఓసి ని నడిపించిన విధంగా OB , కోల్ ను పూర్తిగా సింగరేణి ఉద్యోగులతో నడిపించాలని, టి బీ జి కే ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం జికేఓసి మేనేజర్ శ్రీ మురళి కి వినతి పత్రం అందజేసి, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కు కార్మికుల వినతిని పంపవలసిందిగా కోరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ గతంలో ఉన్న బిఆర్‌ఎస్ ప్రభుత్వం టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో, కార్మికుల పక్షాన ఉంటూ కార్మికులకు అనేక హక్కులు తీసుకురావడం జరిగిందన్నారు.

గెలిచిన యూనియన్లు సింగరేణిలో గెలిచిన నాటినుండి కార్మికులకు ఏ ఒక్క హక్కు తీసుకురాలేదని,కార్మికులకు ఇచ్చిన హామీలు పట్టించుకోవడమే మరిచారని, ఇప్పటికైనా అన్ని యూనియన్లను కలుపుకొని, వి కే ఓ సి ని సింగరేణి కార్మికులతో నడిపే విధంగా ఎండి ని, ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ గడప రాజయ్య సెంట్రల్ కమిటీ మెంబెర్స్ కాగితపు విజయకుమార్, బొరింగ్ శంకర్, బ్రాంచ్ సెక్రెటరీ రాజ్ కుమార్, పివికే 5 ఫిట్ సెక్రెటరీ వెంకటేశ్వర్లు టీబీజీకేస్ నాయకులు మరియు జికేఓసి ఉద్యోగులు పాల్గొన్నారు.