బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే పాయం
బూర్గంపాడు,(విజయక్రాంతి): బూర్గంపాడు మండల కేంద్రంలో జరుగుతున్న యూసుఫ్ మెమోరియల్ క్రికెట్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం గుంటుపల్లి ఎలెవన్ సారపాక వర్సెస్ ఫరీద్ ఎలెవన్ కొత్తగూడెం జట్ల మధ్య హోరా హోరీగా సాగింది. మొదట బ్యాటింగ్ చేసిన ఫరీద్ ఎలెవన్ కొత్తగూడెం జట్టు నిర్ణీత 15 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. 155 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన గుంటుపల్లి ఎలెవన్ సారపాక జట్టు 15 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 138 పరుగులే చేసి ఓటమి చవిచూసింది. కొత్తగూడెం జట్టులోని బ్యాటర్ నితిన్ 56 పరుగులు చేయడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు. ఈ బహుమతుల ప్రదానోత్సవం కార్యక్రమానికి పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు(MLA Payam Venkateswarlu) మాట్లాడుతూ... క్రీడలు అనేవి యువతలో దాగివున్న నైపుణ్యాన్ని వెలికితీసి వారి ప్రతిభను ప్రపంచ నలుమూలలు చాటిచెప్పడానికి దోహదపడతాయని తెలిపారు.
ఈ టోర్నమెంట్ 17 సంవత్సరాలుగా నిర్వహించటం హర్షినియమన్నారు. బూర్గంపాడు యువత ఆదర్శప్రాయులన్నారు. అనంతరం విన్నర్స్ ఫరీద్ ఎలెవన్ కొత్తగూడెం టీమ్ కు రూ.30 వేలు, షీల్డ్, రన్నర్స్ గుంటుపల్లి ఎలెవన్ సారపాక టీమ్ కు రూ.20వేలు షీల్డ్ ను అందజేశారు. టోర్నీ స్పాన్సర్ గూగోలోత్ కిషోర్ శివరాం నాయక్, బుద్ధరాజు నవీన్ బాబు, క్యాష్ ప్రైజ్ విజేతలకి అందజేయగా, ట్రోఫీ స్పాన్సర్స్ డేగల రాజు యాదవ్ విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ పిఎసిఎస్ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, బ్రిలియంట్ విద్యాసంస్థల చైర్మన్ బిఎన్ఆర్, నియోజవర్గ బి బ్లాక్ మహిళా అధ్యక్షురాలు బర్ల నాగమణి,ఆర్గనైజింగ్ కమీటీ సభ్యులు సోహైల్ పాషా, సర్వేశ్వరావు, గోనెల నాని, భజన సతీష్, భజన ప్రసాద్, అబ్దుల్ సలీమ్, సారధి,సతిపండు,కిషోర్,మంద ప్రసాద్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.