భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శుక్రవారం రూ.5 లక్షల విలువ గల నిషేధిత గుట్కా, కైనీ కొత్తగూడెం టాస్క్ ఫోర్స్ సిఐ రమాకాంత్ పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే... భద్రాచలంలో నిషేధిత గుట్కా పాన్ మసాలా కైనీల విక్ర యాలు జోరుగా సాగుతున్నాయని వచ్చిన సమాచారం మేరకు సిబ్బందితో భద్రాచలంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కూనవరం రోడ్డు రెడ్ క్రాస్ బిల్డింగ్ ఎదురుగా ఉన్న ఓ గోదాములో అక్రమంగా నిల్వ ఉంచిన రూ 5 లక్షల విలువగల నిషేధిత అంబర్ పాన్ మసాలా లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న అంబర్ పాన్ మసాలాలను సీజ్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. సదరు ఆ వ్యక్తిపై కేసు నమోదు చేస్తే అది అప్ చేస్తున్నారు.