భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 15 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. 2023 సాధారాణ ఎన్నికల సమయంలో సాంబశివరావు ఎన్నికల అఫిడవిట్‌లో సమగ్ర వివరాలు వెల్లడించలేదని, ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ కొత్తగూడెంకు చెందిన నందులాల్ అగ్రవాల్ గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో తనపై హైకోర్టులో దాఖలైన ఎన్నికల పిటిషన్ కొట్టివేయాలని కూనంనేని సాంబశివరావు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.
ఆయన పిటిషన్‌ను సుప్రీంకోర్టు నిరాకరించింది. అఫిడివిట్‌లో సమగ్ర వివరాలు ఇవ్వనందున.. తదుపరి విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించింది. కాగా ఈ విషయమై ఎమ్మెల్యే కూనంనేని స్పందిస్తూ ఎన్నికల అఫిడవిట్‌లో లోపాలున్నాయని దాఖలు చేసిన అఫిడవిట్‌లో నిజం లేదని, న్యాయస్థానం సమగ్రంగా విచారించి క్లీన్ చీట్ ఇస్తుందన్న నమ్మకం ఉందన్నారు.