03-03-2025 10:21:25 PM
కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం పట్టణంలోని శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానములో శ్రీ స్వామివారికి భక్తులు మొక్కుబడిగా సమర్పించిన కానుకల హుండీలను సోమవారం లెక్కించారు. రూ.5,02,467/- (నోట్స్-4,27,745/-, కాయిన్స్–74,722/-) వచ్చినవి. తేదీ:18.06.2024 నుండి తేదీ: 03.03.2025 తొమ్మిది(09) నెలలలో భక్తులు స్వామి వారికి సమర్పించిన కానుకలు. ఇట్టి కార్యక్రమములో ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి యన్. రజనీ కుమారి, శ్రీ నీలకంటేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ జి.సుదర్శన్, ఆలయ అర్చకులు, సిబ్బంది, సేవాసమితి సభ్యులు, పాల్గొన్నారు.