calender_icon.png 18 January, 2025 | 12:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్తగూడెం కార్పొరేషన్ పై పునరాలోచించాలి

17-01-2025 06:13:19 PM

గవర్నర్ ను కలిసిన గిరిజన సంఘాల నేతలు... 

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ కొత్తగూడెం సుజాతనగర్ మండలంలోని ఏడు పంచాయతీలను కలుపుతూ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదనపై పునరాలోచించాలని గిరిజన సంఘాల నాయకులు శుక్రవారం రాష్ట్ర గవర్నర్ జిస్ట్ను దేవ వర్మను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఏజెన్సీ ప్రాంతాలలో కలుపుతూ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్, KUDA రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ను, మున్సిపల్ అర్బన్ అడిషనల్ డైరెక్టర్స్ సైదానాయకుని గిరిజన సంఘాల నాయకులు కలసి వినతిపత్రాలు అందజేశారు. గవర్నర్ ను కలిసిన వారిలో సేవాలాల్ సేన వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు భూక్య సంజీవ్ నాయక్, న్యాయవాది లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ నాయక్, TSTTF రాష్ట్ర అధ్యక్షులు బానోత్ వీరు నాయక్, సేవాలాల్ సేన రాష్ట్ర కోకన్వీనర్ బానోత్ హుస్సేన్ నాయక్, ఆదివాసి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు బాడీష బిక్షం నాయక్ TS TTF రాష్ట్ర కార్యదర్శి బానోత్ రాములు, TS TTF జిల్లా నాయకులు సపావత్ బాలకృష్ణ, సేవాలాల్ సే ఫ్రీన నాయకులు బట్టు కృష్ణ బట్టు వీరన్న వీరు నాయక్ జరుపుల పరమేష్ తదితరులు పాల్గొన్నారు.