calender_icon.png 1 March, 2025 | 9:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి, రవాణాను సాధించిన కొత్తగూడెం ఏరియా

01-03-2025 06:55:56 PM

ఏరియా సింగరేణి బొగ్గు ఉత్పత్తి వివరాలు

కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఏరియా 2024-25 ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి నెలకు కొత్తగూడెం ఏరియాకు నిర్దేశించబడిన 15.39 లక్షల టన్నుల ఉత్పత్తి  నిర్దేశించిన లక్ష్యం 11.39 లక్షల టన్నులకు గాను 12.30 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి 108% ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించారు. రోడ్డు,రైల్ ద్వారా మార్గాల ద్వారా 12.82 లక్షల టన్నుల బొగ్గు రవాణా నిర్వహించారు.  ఫిబ్రవరిలో జెవిఆర్ సిహెచ్ నుండి 221 రేకుల బొగ్గు రవాణా జరుగగా, రుద్రంపూర్ సీహెచ్పీ నుండి 67 రేకుల బొగ్గు రవాణా చేసి మొత్తంగా 288 రేకుల బొగ్గు రవాణా చేశారు. రోజుకు సగటున 10.29 రేకులు డిస్పాచ్ చేసినట్టు అధికారులు తెలిపారు.

2024-25 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుండి ఫిబ్రవరి వరకు వికే ఓసికి నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని మినహాయించినట్లయితే 126.84 లక్షల టన్నులకు గాను 126.65 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి 100% శాతం ఉత్పత్తి లక్ష్యం సాధించామన్నారు. అదే విధముగా 2024-25 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుండి ఫిబ్రవరి వరకు 146.10 లక్షల టన్నుల బొగ్గు రవాణా జరిగినది. మన కొత్తగూడెం ఏరియాకు నిర్దేశించిన  బొగ్గు ఉత్పత్తి, రవాణా లక్ష్యం సాధించడంలో భాగస్తులు అయినటువంటి ఉద్యోగులకు, అధికారులకు మరియు యూనియన్ ప్రతినిధులందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన రోజులు కూడా రక్షణతో కొత్తగూడెం ఏరియాకు నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి, రవాణా సాదించి  సింగరేణిలోనే కొత్తగూడెం ఏరియా ముందు వరుసలో ఉండేలా చూడాలని అలాగే  కంపెనీ పురోగాభివృదికి కృషిచేయాలన్నారు.