17-04-2025 05:11:09 PM
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవంలో పీఏసీ ఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్..
మంథని (విజయక్రాంతి): రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్(Single Window Chairman Kotha Srinivas) అన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మంథని ఆధ్వర్యంలో మండలంలోని ఎక్లాస్ పూర్, గంగాపురిలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ ప్రారంభించగా, ఖానాపూర్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సంఘ డైరెక్టర్ రావికంటి సతీష్ కుమార్, శ్రీపాదకాలనీలో డైరెక్టర్ దాసరి లక్ష్మీ, అంగులూర్ కేంద్రాన్ని డైరెక్టర్ లెక్కల కిషన్ రెడ్డిలు గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ మాట్లాడుతూ... మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు త్వరితగతిన కేంద్రాలను ప్రారంభించుకోవడం జరుగుతుందని అన్నారు. సన్నచిన్నకారు రైతులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని, గత ప్రభుత్వంలో క్వింటాల్ కు 2 నుంచి 4కిలోల తరుగు తీసేవారని, తమ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క గింజ కటింగ్ లేకుండా మంత్రి శ్రీధర్ బాబు జిల్లా కలెక్టర్, అధికార యంత్రాగానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు.
వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో సంఘ ఉపాధ్యక్షుడు బెల్లంకొండ ప్రకాష్ రెడ్డి, ఆకుల రాజబాబు, కొత్త శ్రీనివాస్, దేవళ్ళ విజయ్ కుమార్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ముస్కుల సురేందర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పెండ్లి రమ-సురేష్ రెడ్డి, నాయకులు పేరవేన లింగయ్య, మూల పురుషోత్తం రెడ్డి, అజీంఖాన్, కుడుదుల వెంకన్న, గుండా పాపారావు, ఆకుల శ్రీనివాస్, బూడిది శంకర్, ఊట్ల అనిల్, పెండ్లి ప్రభాకర్ రెడ్డి, ఆర్ల నారాయణ, దొరగొర్ల శ్రీనివాస్, సేమంతుల ఓదెలు, బాస అశోక్, పుట్ట శంకరయ్య, పెంటరి రాజు, ఎరుకల రమేష్, నామని సుగుణ, లైసెట్టి రాజు, ఎరుకల ప్రవీణ్, సాదుల శ్రీకాంత్, కొట్టె రమేష్, సహకార శాఖ మానిటరింగ్ అధికారి పి. సురేందర్ రెడ్డి, సంఘ కార్యదర్శి మామిడాల అశోక్ కుమార్, సంఘ సిబ్బంది, రైతులు, తదితరులు పాల్గొన్నారు.