calender_icon.png 27 February, 2025 | 6:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొండంగులబోడు కొత్తకొండ వీరభద్ర స్వామి దేవాలయంలో ఘనంగా కళ్యాణం

27-02-2025 03:29:30 PM

టేకులపల్లి, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం మద్రాస్ తండా గ్రామపంచాయతీలోని కొండంగులబోడు గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామి భద్రకాళి సమేత కళ్యాణ మహోత్సవం మహాశివరాత్రి జాతర బుధవారం అర్ధరాత్రి రంగరంగ వైభవంగా జరిగింది. మహాశివరాత్రికి ముఖ్యఅతిథిగా ఇల్లందు ఎమ్మెల్యే  కోరం కనకయ్య, లక్ష్మీ దంపతులు, కోరం సురేందర్ - ఉమ  దంపతులు హాజరై కళ్యాణం జరిపించారు.

ఈ ఏడాది కొండంగులబోడు  గ్రామంలో భక్తులు తండోపతండాలుగా వచ్చి అత్యధిక సంఖ్యలో  పాల్గొన్నారు. వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని  కొండంగులబోడు  ఉద్యోగ సంఘం నుంచి జరుపులా.వీరన్న, జరుపుల రాజేందర్, జరుపుల కిషన్, భూక్య శ్రీరామ్, జరుపుల భాస్కర్, భక్తులు పూజలో పాల్గొని హోమం నిర్వహించారు. గురువారం ఉదయం స్వామివారికి ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. జాతర వైభవంగా నిర్వహించినందుకు కొండంగులబోడు యూత్ కమిటీ, పోలీస్ సిబ్బందిని ఎమ్మెల్యే అభినందించారు.