calender_icon.png 4 March, 2025 | 5:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోటకొండను మండలంగా ప్రకటించాలి

04-03-2025 01:50:38 AM

సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ పార్టీ డివిజన్ కార్యదర్శి కాశీనాథ్

నారాయణపేట. మార్చి 3 (విజయక్రాంతి) ః అన్ని అరతలు ఉన్న  కోటకోండ ను మండలం గా  ప్రకటించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెలలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కోటకొండ ను ముఖ్యమంత్రి   నోటీ నుండి ప్రకటిస్తానని అనేక సందర్భాల్లో ఎమ్మెల్యే పర్నిక రెడ్డి  మాజీ డిసిసి అధ్యక్షులు కుంభం  శివకుమార్ రెడ్డి  అనేక సందర్భాల్లో మీడియా ముఖంగా బహిరంగంగానే ప్రకటించారు.

ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటకొండ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాల్సి ఉండే ద న్నారు. ఈ ప్రాంత ప్రజల ఆశను నిరాశ చేశారన్నారు . ఇప్పటికైనా రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , స్థానిక ఎమ్మెల్యే వర్ణిక రెడ్డి, జిల్లా కలెక్టర్  స్పందించి జిల్లాలోని పెద్ద గ్రామపంచాయతీ అయిన కోటకొండ ను మండల కేంద్రంగా వెంటనే ప్రకటించాలనీ అన్నారు. జిల్లా కలెక్టర్ గా మీరు చొరవ తీసుకొని కోటకొండ ను మండలం గా ప్రకటించాలని కోరుతూ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భవిష్యత్తు కార్యాచరణ ఉద్యమాలు చేపడతామని అన్నారు. కార్యక్రమంలో నీలి దాము ,సలీం,మౌలాలి పాల్గొన్నారు.