హైదరాబాద్, జనవరి 18: ప్రైవే టు రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ కన్సాలిడేటెడ్ నికరలాభం 2024 అక్టోబర్ త్రైమాసికంలో 10 శాతం వృద్ధిచెంది రూ. 4,701 కోట్లకు చేరింది. గత ఏడాది క్యూ3 లో బ్యాంక్ రూ. 4,265 కోట్ల కన్సాలిడేటెడ్ నికరలాభాన్ని ఆర్జించింది.
సెప్టెంబర్ క్వార్టర్లో రూ. 5,044 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. స్టాండెలోన్ ప్రాతిపాదికన బ్యాంక్ నికరలాభం ఏడాది క్రితంతో పోలిస్తే రూ. 3,005 కోట్ల నుంచి రూ. 3,304 కోట్లకు చేరగా, అంతకుముందు క్యూ2లో ఆర్జించిన రూ. 3,343 కోట్లకంటే తగ్గింది. క్యూ3లో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ. 14,096 కోట్ల నుంచి రూ. 16,050 కోట్లకు పెరిగింది. స్థూల మొండి బ కాయిలు క్యూ2లో 1.49 శాతంతో పోలిస్తే 1.50 శాతానికి పెరిగాయని, కేటాయింపులు రూ. 579 కోట్ల నుం చి రూ.794 కోట్లకు చేరాయని కోట క్ మహీంద్రా బ్యాంక్ తెలిపింది.