న్యూఢిల్లీ, జనవరి 3: ప్రైవేటు రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో), చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీవో) మిలింద్ నాగ్నూర్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామా 2025 ఫిబ్రవరి 15 పనివేళలు ముగిసిన తర్వాత అమలులోకి వస్తుందని కోటక్ మహీంద్రా బ్యాంక్ శుక్రవరం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.