న్యూఢిల్లీ, అక్టోబర్ 19: ప్రైవేటు రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ స్టాండెలోన్ నికరలాభం ఈ జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 5 శాతం వృద్ధిచెంది రూ. 3,344 కోట్లకు చేరింది. గత ఏడాది క్యూ2లో ఈ బ్యాంక్ రూ. 3,191 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. మొత్తం ఆదాయం రూ.13,507 కోట్ల నుంచి రూ. 15,900 కోట్లకు వృద్ధిచెందినట్లు కోటక్ మహీంద్రా బ్యాంక్ స్టాక్ ఎక్సేంజీలకు అందించిన సమాచారంలో పేర్కొంది.
సమీక్షా త్రైమాసికంలో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 11 శాతం వృద్ధితో రూ.6,297 కోట్ల నుంచి రూ.7,020 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు మాత్రం 5.22 శాతం నుంచి 5.22 శాతానికి తగ్గాయి. కోటక్ బ్యాంక్ స్థూల ఎన్‌పీఏలు 1.72 శాతం నుంచి 1.49 శాతానికి తగ్గగా, నికర ఎన్‌పీఏలు మాత్రం 0.37 శాతం నుంచి రూ. 0.43 శాతానికి పెరిగాయి.