calender_icon.png 15 January, 2025 | 9:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాణ్యత లేని ఆహార పదార్థాలు విక్రయిస్తే చర్యలు

26-08-2024 06:34:01 PM

మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి 

కోరుట్ల,(విజయక్రాంతి): నాణ్యత లేని ఆహార పదార్థాలు విక్రయించే వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని కోరుట్ల మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలు, పట్టణ ప్రజల ఫిర్యాదుల మేరకు కోరుట్ల మున్సిపల్ అధికారులు పలు రెస్టారెంట్, హోటళ్లలో  ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిల్వ ఉంచిన, కుళ్ళిపోయిన ఆహార పదార్థాలు స్వాధీన పరుచుకొని డంపింగ్ యార్డ్ లో గుంత తీసి పూడ్చి వేశారు. పరిశుభ్రతను పాటించని రెస్టారెంట్ , హోటళ్ల యజమానులకు రూ .32 వేల జరిమానాలు విధించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి మాట్లాడుతూ... రెస్టారెంట్లు నిర్వహించే యజమానులు ప్రస్తుత వర్షాకాలాని దృష్టిలో ఉంచుకొని అంటూ వ్యాధులు ప్రబలకుండా పరిశుభ్రతను పాటించాలని, నాణ్యమైన పరిశుభ్రమైన తాజా ఆహారాన్ని మాత్రమే విక్రయించాలన్నారు. నాసిరకం, కుళ్లిన ఆహార పదార్థాల వ్యాపారుల నిర్వాహలకు ఉద్దేశించడం తగదని అన్నారు. ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. నాణ్యత ప్రమాణాలను పాటించాలని, లేనిపక్షంలో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించడంతో పాటు భారీ మొత్తంలో జరిమానాలు విధించి,చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయన్నారు. ఈ తనిఖీలో సానిటరీ ఇన్ స్పెక్టర్ బాలె అశోక్, జగ్గల్ల రమేష్, సానిటర్ జవాన్ లు చిట్యాల గాజం, చిట్యాల రమేష్ , చిట్యాల రాజ్ కుమార్ ఉన్నారు.