07-03-2025 12:16:42 AM
ఎంపీడీవోకు అదనపు బాధ్యతలు
జగిత్యాల, మార్చి 6 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపల్ కమిషనర్ బి.తిరుపతిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. గత కొద్ది రోజులుగా పలు వివాదాలలో ఇరుక్కొని పత్రికలకెక్కిన తిరుపతిపై సస్పెన్షన్ వేటు పడింది. కాగా కోరుట్ల ఎంపీడీవో రామకృష్ణకు, మున్సిపల్ కమిషనర్గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు కలెక్టర్ ఆదేశించారు. గురువారం సాయంత్రం ఎంపీడీవో రామకృష్ణ కమిషనర్ బాధ్యతలు స్వీకరించగా, కోరుట్ల బల్దియా సిబ్బంది పుష్పగుచ్చాన్ని అందజేసి స్వాగతించారు.