calender_icon.png 20 January, 2025 | 1:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్చిలో జర్నీ మొదలెట్టనున్న కొరియన్ కనకరాజు!

20-01-2025 12:20:52 AM

ఆదివారం వరుణ్‌తేజ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న 15వ చిత్రాన్ని మేకర్స్ ప్రకటించారు. ‘వీటీ15’ అనే మేకింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఒక ప్రత్యేకమైన కొరియన్ కనెక్షన్‌ను చూపిస్తోంది.

ఇందులో ఫైర్ డ్రాగన్ లోగోతో ఉన్న జాడి మంటల మధ్య ఉండటం, కొరియన్ భాషలో రాసి ఉన్న అక్షరాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ‘వేటాడుతున్నప్పుడు ఉల్లాసంగా ఉంటుంది’ అనే వ్యాఖ్య ఇదొక అడ్వంచరస్ జర్నీ అని తెలుస్తోంది. ఈ ఇండో -కొరియన్ హర్రర్ కామెడీ చిత్రంలో వరుణ్‌తేజ్ యూనిక్ క్యారెక్టర్‌లో కనిపించనున్నట్టు తెలుస్తోంది.

‘తొలిప్రేమ’ తర్వాత వరుణ్‌తేజ్, సంగీత దర్శకుడు థమన్ ఈ ప్రాజెక్టు కోసం మరోమారు కలిసి పనిచేయనున్నారు. ప్రొడక్షన్ పనులు మార్చిలో ప్రారంభిస్తామని, మిగతా నటీనటులు, సాంకేతిక సిబ్బంది వివరాలు త్వరలో తెలియజేస్తామని మేకర్స్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకు ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని సమాచారం.