కరీంనగర్,(విజయక్రాంతి): వరద బాధితులను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైది మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. వరదలతో రాష్ట్ర ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే మొద్దు నిద్ర పోతున్నది రేవంత్ సర్కార్ అని మండిపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్లాలన్నా హెలికాప్టర్ దొరుకుతుంది.కానీ వరదలో చిక్కుకున్న ప్రజలకు కాపాడేందుకు హెలికాప్టర్ దొరకదా అని ప్రశ్నించారు. కెసిఆర్ పాలనలో వరదల సమయంలో వరద బాధితుల ఆపత్కాలంలో కంటికి రెప్పలా నిలిచారన్నారు. గతంలో వరదలు వేస్తే కెసిఆర్ స్వయంగా పరామర్శించి.. ధైర్యాన్ని ఇచ్చారని గుర్రు చేశారు. తక్షణ సాయంకింద ములుగు జిల్లాకు రూ.2.5 కోట్లు, భూపాలపల్లికి రూ.2 కోట్లు, మహబూబాబాద్‌కు రూ.1.50కోట్లు విడుదల చేశారన్నారు. గతంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి వరదల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ. 25 లక్షలు పరిహారం అందిస్తామని చెప్పారన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు. మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని, రూ.25 లక్షలు పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు.