calender_icon.png 20 September, 2024 | 2:00 PM

అప్పులు ఉన్నాయని.. హామీలు నేరవేర్చలేం అనటం తప్పే

27-07-2024 05:54:14 PM

హైదరాబాద్: సభలో అన్నప్రాశన రోజే ఆవకాయ పెట్టినట్లుగా కొందరి వ్యవహార శైలి ఉందని కొత్తగూడెం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. తెలంగాణ శాసనసభలో బడ్జెట్ పద్దుపై చర్చ సందర్భంగా శనివారం ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన తప్పులు ఈ ప్రభుత్వం చేయవద్దని భావిస్తున్నానని, కొత్త ప్రభుత్వానికి కనీసం ఏడాది అయినా సమయం ఇవ్వాలని ఆయన తెలిపారు. ఆర్నెళ్లకే అన్ని చేయలేదు అని ఈ ప్రభుత్వాన్ని అనటం సరికాదన్నారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు మేలు చేయాలనే ప్రభుత్వ భావిస్తోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం దాదాపు రూ.7 లక్షల కోట్లు అప్పు చేసిందని, అప్పు తీర్చేందుకే మరో అప్పు చేయాల్సిన స్థితిలో ప్రభుత్వం ఉందని తెలిపారు. అప్పులు ఉన్నాయి.. ఇచ్చిన హామీలు నేరవేర్చలేం అనటం కూడా తప్పే అవుతుందని కూనంనేని పేర్కొన్నారు.