calender_icon.png 19 April, 2025 | 8:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సన్నబియ్యం లబ్దిదారుని ఇంట్లో చేయి కడిగిన ఎమ్మెల్యే..

19-04-2025 05:35:56 PM

పేదింట్లో సన్నబియ్యంతో సహపంక్తి భోజనం చేసిన కూనంనేని..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): సన్న బియ్యం పథకం అమలు ప్రభుత్వానికి సాహసమేనీ, పేదల ఆకలిని గుర్తించి పథకం అమలుకు పూనుకోవడం అభినందనీయంనీ కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు(MLA kunamneni sambasiva rao) అన్నారు. శనివారం పాల్వంచ పట్టణ పరిధిలోని బాపూజీ నగర్ లో సన్నబియ్యం లబ్దిదారుని ఇంట్లో అధికారులు, నాయకులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పేదల ఆకలిని గుర్తించి పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవడం అభినందనీయమన్నారు. రేషన్ షాపుల నిర్వహనను అధికారులు నిత్యం పర్యవేక్షించాలినీ సూచించారు. 

ఈ కార్యక్రమంలో పాల్వంచ తహసిల్దార్ వివేక్ మున్సిపల్ కమిషనర్ సుజాత సీపీఐ జిల్లా కార్యదర్శి SK సాబీర్ పాషా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నూకల రంగారావు, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం, సీపీఐ, కాంగ్రెస్ నాయకులు చంద్రగిరి శ్రీనివాసరావు, కంచర్ల జమలయ్య ఉప్పుశెట్టి రాహుల్, అన్నారపు వెంకటేశ్వర్లు, ముత్యాల కిరణ్ కుమార్, వైయస్ గిరి, బట్టు మురళి, విజయ్, రాంబాబు, హెచ్ మధు, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.