calender_icon.png 6 January, 2025 | 8:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజేతగా కోనేరు హంపి

30-12-2024 01:22:21 AM

* వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్

* రెండో సారి గెలుచుకున్న హంపి

* అర్జున్‌కు నిరాశ

న్యూయార్క్: ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలుగు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి విజేతగా నిలిచింది. హంపి 8.5 పాయింట్లతో విజేతగా అవతరించింది. 2019లో కూడా హంపి చాంపియన్‌గా నిలిచింది. ఆనాటి  ఎడిషన్ మాస్కోలో జరిగిం ది. 

ఇండోనేషియాకు చెందిన ఇంటర్నేషనల్ మాస్టర్ సుకందర్‌తో జరిగిన 11వ రౌండ్‌లో విజయం సాధించి మొత్తం 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. 11 గేమ్‌లు ఆడిన హంపి ఏడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి మరో మూడు మ్యాచ్‌లను డ్రాగా ముగించింది.

అంతే కాకుండా ఒక మ్యాచ్‌లో పరాజయం కూడా చవి చూసింది. మొదటి మ్యాచ్‌లోనే పరాజయం చవిచూసినా కానీ ఎక్కడా విశ్వాసం కోల్పోకుండా ఆడి చాంపియన్‌షిప్‌ను గెల్చుకుంది. చైనాకు చెందిన గ్రాండ్ మాస్టర్ వెన్‌జున్ రెండో స్థానంలో నిలిచింది. 

18 ఏండ్లకే..

ఇక ఓపెన్ వి భాగంలో 18 సం వత్సరాల వోలోదర్‌ముర్జిన్ (రష్యా) విజేతగా నిలిచాడు. 13 రౌండ్లు పూర్తయ్యే సరికి అందరికంటే ఎక్కువగా 10 పాయింట్ల సాధించిన ముర్జిన్ విజేతగా అవతరించాడు. ముర్జిన్ ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకవపోవడం గమనార్హం.

మహిళల కేటగిరీలో విజేతగా నిలిచిన హంపికి 37 సంవత్సరాలు కాగా.. పురుషుల కేటగిరీలో గెలిచిన ముర్జిన్‌కు 18 సంవత్సరాలే కావడం గమనార్హం. తొమ్మిది రౌండ్లు పూర్తయ్యే వరకు తొలి స్థానంలో ఉన్న అర్జున్ (9) చివర్లో వెనుకబడిపోయి.. ఐదో స్థానంలో నిలిచాడు.