calender_icon.png 16 January, 2025 | 2:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బరిలో కోనేరు హంపి

15-01-2025 11:48:32 PM

నార్వే చెస్ టోర్నీ

స్టావెంజర్ (నార్వే): ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్, భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి మేలో జరగనున్న నార్వే చెస్ మహిళల టోర్నీలో పాల్గొననుంది. ప్రస్తుతం ప్రపంచ చెస్ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో ఉన్న హంపి నార్వే టోర్నీలో ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. 2002లో గ్రాండ్‌మాస్టర్ టైటిల్ సాధించిన తొలి మహిళగా రికార్డులకెక్కింది. గతేడాది చెస్ ఒలింపియాడ్ గెలిచిన జట్టులో భాగమైన హంపి 2019, 2024లో వరల్డ్ ర్యాపిడ్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను అందుకుంది. 2020లో బీసీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికైంది.