calender_icon.png 3 April, 2025 | 7:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొండాపూర్ ఆర్ఐ సస్పెన్షన్.. తహసిల్దార్ బదిలీ

02-04-2025 11:23:59 PM

భూమి వారసత్వ బదిలీ...

తప్పుడు పంచనామా చేయటం పట్ల కలెక్టర్ ఆగ్రహం...

కొండాపూర్: కొండాపూర్ తాసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న అర్ఐని సస్పెన్షన్ చేయడంతో పాటు తాసిల్దార్ ను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు తెలిపారు. సక్సేషన్ (పౌతి) చనిపోయిన వారి పేరు మీద, బతికి ఉన్న వారసుల పేరు మీద తప్పుడు పంచనామా  చేసినందుకు కొండాపూర్ ఆర్ఐ మహాదేవ్ సస్పెన్షన్ చేశామన్నారు. 

పర్యవేక్షణలో నిర్లక్ష్యం కారణంగా తాసిల్దార్ ఏస్తేరు అనితను నారాయణఖేడ్  ఆర్డిఓ కార్యాలయం అడ్మినిస్ట్రేషన్ అధికారిగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కొండాపూర్ మండలంలో ఆర్ఐ తప్పుడు పంచనామా నివేదిక ఆధారంగా తహసిల్దార్ పర్యవేక్షణలో నిర్లక్ష్యం కారణంగా వారసత్వ ధ్రువీకరణ పత్రం మంజూరు చేశారని చెప్పారు. బాధితులు కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపిన కలెక్టర్, ఆర్ఐ ని సస్పెన్షన్ చేస్తూ తాసిల్దార్ ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.