25 May, 2026 | 2:41 AM

మద్యం మత్తులో కొండాపూర్ పోలీసులు..!

25-05-2026 01:44 AM

విధుల్లో ఉండగా మద్యపానం 

కొండాపూర్, మే 25 : కొండాపూ ర్ పోలీస్ స్టేషన్లో డ్యూటీలో ఉన్న పో లీసులు మద్యం సే వించారనే ఆరోపణ లు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. స్థానికు ల వివరాల ప్రకారం.. శనివారం రాత్రి ఫిర్యాదు నిమిత్తం కొందరు పోలీస్ స్టేషన్కు వెళ్లగా పలుమార్లు పిలిచినా ఎవరూ స్పం దించలేదని తెలిపారు. దీంతో అనుమానం వచ్చిన వారు స్టేషన్ వెనుక భాగంలో ఉన్న రెస్ట్రూమ్ వద్దకు వెళ్లి చూడగా డ్యూటీలో ఉన్న కొందరు పోలీసులు అపరిచిత వ్యక్తులతో కలిసి మద్యం సేవిస్తున్నట్లు కనిపిం చిందని ఆరోపిస్తున్నారు.

ఈ ఘటన చూసిన స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీడియోలు చిత్రీకరించారు. ప్రజల భద్రత కోసం పనిచేయాల్సిన పోలీసులు విధి నిర్వహణ సమయంలోనే ఇలా వ్యవహరించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. విషయం బయటకు రావడంతో ఉన్నతాధికారులు ఘటనపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఆరోపణల్లో నిజానిజాలు తేలిన అనంతరం సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకునే అవకాశముందని సమాచారం.