calender_icon.png 10 January, 2025 | 11:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

'డైన్ ఇన్ చైనా' హోటల్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

03-01-2025 06:18:57 PM

హైదరాబాద్: ప్రముఖ రెస్టారెంట్లు, హోటల్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుస దాడులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం సాయంత్రం కొండాపూర్ లోని 'డైన్ ఇన్ చైనా' హోటల్(Dine in China hotel)లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో జీహెచ్ఎంసీ ఆహారభద్రత అధికారులు(GHMC food safety officials) కుళ్లిన మాంసం, గడువు ముగిసిన ప్యాకింగ్ ఆహార పదార్థాలు గుర్తించారు. అనంతరం హోటల్ యాజమాన్యానికి అధికారులు నోటీసులు ఇచ్చారు.