calender_icon.png 27 January, 2025 | 4:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశం గర్వించదగ్గ చిత్రకారుడు కొండపల్లి

26-01-2025 01:39:15 AM

  • గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
  • మాదాపూర్‌లో పెయింటింగ్ ప్రదర్శన

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 25 (విజయక్రాంతి): భారతీయ చిత్రకళా నైపుణ్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన కొండపల్లి శేషగిరిరావు దేశం గర్వించదగ్గ బహుముఖ ప్రతిభా చిత్రకారులు అని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కొనియాడారు. కొండపల్లి శేషగిరిరావు శత జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ, జేఎన్‌ఏఎఫ్‌ఏ యూనివర్సిటీ పెయింటింగ్ విభాగం, కుటుంబ సభ్యుల సంయుక్త ఆధ్వర్యంలో ‘రివైవింగ్ ద రూట్స్’ పేరుతో మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో డాక్టర్ కొండపల్లి శేషగిరిరావు పెయింటింగ్స్ ప్రదర్శన శనివారం ప్రారంభించారు.

కార్యక్ర  ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ మాట్లాడుతూ.. కొండపల్లి శేషగిరిరావు పురాణగాథల సాంప్రదాయక చిత్రకారులని అన్నారు. ఈ ప్రదర్శనలో కొండపల్లి శేషగిరిరా  గీసిన అరుదైన స్కెచ్‌లు, ఆయిల్ పెయింటింగ్స్, ఆక్వాటెక్చర్ పెయింటింగ్స్ అద్భు  ఉన్నాయన్నారు. కాకతీయ శిల్పకళా వైభవాన్ని ఆధునిక కోణంలో ఆవిష్కరించిన గొప్ప చిత్రకారుడు అని కొనియాడారు.

హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అధ్యక్షులు ఎంవీ రమణారెడ్డి మాట్లాడుతూ.. ఈ పెయింటింగ్ ప్రదర్శన ఫిబ్రవరి 5వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ను కొండపల్లి శేషగిరిరావు కుమారుడు కొండపల్లి వేణుగోపాలరావు తదితరులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జేఎన్‌ఏఎఫ్‌ఏ యూనివర్శిటీ పెయింటింగ్ హెడ్ డాక్టర్ ప్రితి సంయుక్త కొండపల్లి శేషగిరి రావు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.