సినీస్టార్ వరుణ్‌తేజ
జగిత్యాల, డిసెంబర్ 3 (విజయక్రాంతి): కొండగట్టులో కొలువైన ఆంజనేయస్వామి తమ కుటుంబానికి ఇష్టదైవమని సినీస్టార్ వరుణ్‌తేజ అన్నారు. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న క్షేత్రంలో మంగళవారం ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు, ఆలయ సిబ్బంది ఆయనకు స్వామివారి చిత్రపటం, శేష వస్త్రం, తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.