బాపూజీ కాంస్య విగ్రహం ఆవిష్కరణలో ఎమ్మెల్యే బాలూనాయక్
నల్లగొండ, నవంబర్ 16 (విజయక్రాంతి) : కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు వెలకట్టలేనివని ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు. దేవరకొండలో పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాపూజీ కాంస్య విగ్రహాన్ని ఆయన శనివారం ఆవిష్కరించి మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటులో బాపూజీ కృషి ఎనలేనిదన్నారు. 1952లో దేశంలోనే ప్రథమంగా సహకార సంఘాలు నెలకొల్పిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. తెలంగాణ పీపుల్స్ పార్టీని స్థాపించి ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను చాటారని, టీఆర్ఎస్ బాపూజీ నివాసమైన జలదృశ్యంలోనే పురుడు పోసుకుందని తెలిపారు.