12-04-2025 08:32:01 AM
కొండపోచమ్మ 59 రోజుల హుండీ ఆదాయం 801105.
జగదేవపూర్,(విజయక్రాంతి): జగదేవపూర్ మండల పరిధిలోని తీగుల్ నర్సాపూర్ గ్రామంలో గల ప్రముఖ దేవాలయం కొండపోచమ్మ అమ్మవారు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతుంది. నిత్యం ఎంతో మంది భక్తులు అమ్మవారికి బోనం చేసి ఒడి బియ్యం పోసి సంపాదించిన దాంట్లో నుండి హుండీలో అమ్మవారి పేరు మీద వేస్తుంటారు. ఏప్రిల్ 11 శుక్రవారం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ఓ రవికుమార్ మాట్లాడుతూ 59 రోజుల హుండీ ఆదాయం 801105, ఎనిమిది లక్షల ఒక వెయ్యి నూట అయిదు రూపాయలు సమకూరాయి అని పూర్తి రూపాయలు దేవాదాయ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తాం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ సిద్ధిపేట డివిజన్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి,తాజా మాజీ సర్పంచ్ రజిత రమేష్, ఆలయ డైరెక్టర్ నరేష్,అర్చకులు రమేష్, లక్ష్మణ్,సిబ్బంది కనకయ్య,మహేందర్ రెడ్డి, హరిబాబు,తదితరులు పాల్గొన్నారు.