calender_icon.png 13 February, 2025 | 9:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొండ పోచమ్మ హుండీ ఆదాయం.. రూ.12.80 లక్షలు

13-02-2025 12:00:00 AM

జగదేవపూర్. ఫిబ్రవరి 12: సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల పరిధిలోని తీగుల్ నర్సాపూర్   కొండపోచమ్మ  ఆలయ హుండీని  బుధవారం లెక్కించారు. 75 రోజులకు హుండీ ఆదాయం రూ.12,80,943 రూపాయలు వచ్చాయని ఆలయ ఈవో  రవి కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తులు అమ్మవారికి  చెల్లించిన హుండీ  కానుకలు దేవాదాయ ధర్మాదాయ శాఖ బ్యాంక్ అకౌంట్ లో  జమ అవుతాయని తెలిపారు.

కోరిన కోర్కెలు తీర్చే  కొంగు బంగారంగా కొమురవెల్లి మల్లన్న చెల్లెలుగా ప్రఖ్యాతి  గాంచిన కొండపోచమ్మ  జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయన్నారు. 4వ వారం  భక్తులు అమ్మవారిని దర్శించుకునని మొక్కులు చెల్లించుకొని బోనం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ సిద్ధిపేట డివిజనల్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి,దేవాలయ డైరెక్టర్లు నరేష్, ఆగయ్య, నర్సింలు, సిబ్బంది  కనకయ్య, హరిబాబు, అర్చకులు, తదితరులు పాల్గొన్నారు.