హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): త్యాగశీలి కొండా లక్ష్మణ్ బాపూజీ అని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టుసాయికుమార్ అన్నారు. శుక్రవారం లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన వేడుకలో ఆయన మాట్లాడారు. బాపూజీ అడుగుజాడల్లో ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని, ఆయన సేవలు నిరంతరం గుర్తుండాలన్న లక్ష్యంతోనే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టామని పేర్కొన్నారు.