calender_icon.png 21 September, 2024 | 3:05 AM

రాష్ర్ట పండుగగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి

21-09-2024 12:55:08 AM

త్యాగధనుడు బాపూజీ: సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి):  స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు దివంగత కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. బాపూజీ జయంతిని అక్టోబర్ 27న అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తుందని వెల్లడించింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులను ఆదేశించింది. బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 

త్యాగధనుడు బాపూజీ: సీఎం

1969లో తన మంత్రి పదవిని సైతం వదులుకున్న త్యాగధనుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారని అన్నా రు. శుక్రవారం బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను సీఎం స్మరించుకున్నారు. నైజాం వ్యతిరేక పోరులో పాల్గొంటూనే, బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా వందేమాత రం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో కీలకంగా పనిచేశారని సీఎం అన్నా రు. ఎమ్మెల్యేగా, డిఫ్యూటీ స్పీకర్‌గా, మంత్రిగా వివిధ హోదాల్లో ప్రజలకు సేవ చేయడంతోపాటు నిరంతరం బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి బాపూజీ తపించారని అన్నారు.