calender_icon.png 18 November, 2024 | 3:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్యాగానికి మారుపేరు.. కొండా లక్ష్మణ్ బాపూజీ

09-09-2024 02:23:00 PM

హైదరాబాద్‌: తెలంగాణ కోసం కొండా లక్ష్మన్ బాపూజీ పోరాడారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కు కొండా లక్ష్మణ్ బాపూజీ నిలువ నీడ ఇచ్చారని చెప్పారు. కేసీఆర్ కార్యాలయం ఏర్పాటుకు ఆయన స్థలం ఇచ్చారని గుర్తుచేశారు. కేసీఆర్, కొండా లక్ష్మణ్ బాపూజీ త్యాగాలకు మధ్య తేడా గమనించాలని సీఎం చెప్పారు. ఉప ఎన్నికల్లో సెలక్షన్లు, కలెక్షన్లుతో బాగుపడిందెవరో ప్రజలకు తెలుసని ముఖ్యమంత్రి వెల్లడించారు. కొండ లక్ష్మణ్ బాపూజీని తెలంగాణ ఎప్పుడూ గుర్తిస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు. 

రూ.30 కోట్లున్న చేనేత రుణాలు మాఫీ చేసి చేనేత కార్మికుల రుణ విముక్తులను చేస్తామని సీఎం వెల్లడించారు. రైతన్న ఎంత ముఖ్యమో తమకు నేతన్న కూడా అంతే ముఖ్యం అన్నారు. మీ సమస్యల పరిష్కారానికి మీ అన్నగా మీకు అండగా ఉంటా అన్న సీఎం రేవంత్ ఎలక్షన్, సెలెక్షన్, కలెక్షన్ చేసిన వారిది త్యాగం కాదు.. తెలంగాణ కోసం పదవిని తృణప్రాయంగా వదిలేసిన కొండా లక్ష్మణ్ బాపూజీది అసలు సిసలైన త్యాగం అన్నారు. విద్యా సంస్థలకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు ఉండాలని సీఎం తెలిపారు. త్యాగానికి మారుపేరు కొండా లక్ష్మణ్ బాపూజీ.. ఐఐహెచ్ టీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని  నిర్ణయించామని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కొండా లక్ష్మణ్ బాపూజీ గౌరవం పెంచేలా నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.