calender_icon.png 19 March, 2025 | 9:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డులు

19-03-2025 01:48:35 AM

చేనేత కళాకారుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్, మార్చి 18 (విజయక్రాంతి): జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అ వార్డులను ప్రదానం చేయనుంది. ఇం దుకు చేనేత కళాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ సంచాలకులు శైలజా రామయ్యర్ మంగళవారం ప్రకటనలో తెలిపారు.

చేనేత కళాకారులు 31-12- 2024 నాటికి 30 సంవత్సరాల వ యసు నిండి 10 సంవత్సరాల కనీసం అనుభవం ఉండాలి. చేనేత డిజైనర్లు 31-12-2024 నాటికి 25 సంవత్సరా  వయసు నిండి ఐదు సంవ త్సరాల అనుభవం ఉన్నవారు అర్హులు. ఏప్రిల్ 15వ తేదీలోగా ఆయా జిల్లాల చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులకు సమర్పించాలని పేర్కొన్నారు.